శకుంతల దేవి వారసుడిలా ఉన్నాడు.. ప్రపంచాన్ని శాసిస్తున్న మానవ కంప్యూటర్.. మన హైదరాబాద్ కుర్రాడే

హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఏళ్ల నీలకంఠ భాను ప్రకాష్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా అవతరించాడు. 20 ఏళ్ళ మన యువ కెరటం పెన్ను పేపర్ లేకుండానే ఎంత కఠినమైన లెక్కలను కూడా ఇట్టే సాల్వ్ చేస్తూ మానవ కంప్యూటర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఒక విధంగా ప్రపంచానికి సవాల్ విసురుతున్నాడనే చెప్పాలి. భారత గడ్డపై జన్మించిన హ్యూమన్ కంప్యూటర్ శకుంతల దేవి వారసురాలిగా మళ్ళీ ఒక భారతీయుడే నిలవడం విశేషం. 1950ల కాలంలోనే ఎంతో మంది మేధావులకు రెప్పపాటు సమయంలోనే సాల్వేషన్స్ తో షాక్ ఇచ్చిన ఘనత ఆమెది. ఇటీవల విద్యా బాలన్ కథానాయికగా ఆమె బయోపిక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక శకుంతలా దేవి తరహాలోనే మన హైదరాబాద్ కుర్రాడు కూడా చిటికెలో అతి పెద్ద లెక్కలని నోటితోనే చెప్పేస్తున్నాడు. ఇటీవల లండన్‌లో మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో జరిగిన మెంటల్ కాల్యుక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాను భారతదేశానికి తొలి స్వర్ణం సాధించాడు. ఓక మానవ కంప్యూటర్ గా అవతరరించాడు. యుకె, జర్మనీ, యుఎఇ, ఫ్రాన్స్ గ్రీస్ మరియు లెబనాన్ సహా 13 దేశాల నుండి 30 మంది పోటీలో పాల్గొనగా.. భాను లెబనీస్ పోటీదారు కంటే 65 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.

ఇక యుఎఇ నుండి ఒకరు మూడవ స్థానంలో ఉన్నారు. మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ మొదటిసారి 1998 లో జరిగింది. ప్రకాష్ తన ఐదేళ్ల వయసులోనే SIP అబాకస్ ప్రోగ్రామ్ లో పట్టు సాధించేందుకు అడుగులు వేశాడు. SIP అకాడమీ అందించే గ్రాండ్ మాస్టర్ ప్రోగ్రామ్ అబాకస్ యొక్క తొమ్మిది స్థాయిలను పూర్తి చేశాడు. అతను అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ ’13 మరియు నేషనల్ అబాకస్ ఛాంపియన్ ’11 మరియు ’12 లను కూడా గెలుచుకున్నాడు. భానుప్రకాశ్ ఇప్పటివరకు… ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేషన్, పవర్ మల్టిప్లికేషన్ రికార్డ్, ద సూపర్ సబ్ ట్రాక్షన్ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు.