టాలీవుడ్ లో మరో సీనియర్ దర్శకుడు కరోనా భారిన పడ్డారు. ఇప్పటికే పలువురు దర్శకులు, నటులు కరోనా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కోన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటివరకు షూటింగ్స్ తో బిజిగా ఉన్న తేజ కూడా సడన్ గా కరోనా వైరస్ భారిన ఒడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలడంతో వెంటనే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.
నందిని రాయ్ తో తేజ ఒక వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. అయితే ఇటీవల షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. రాగానే కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఆయన కుటుంబ సబ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా నెగిటివ్ అని తేలింది. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.