ఆర్తి అగర్వాల్ బయోపిక్ ప్లాన్..?

నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయమైన బ్యూటీ ఆర్తి అగర్వాల్. అయితే 2015లో ఆమె అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవ్వాలని బరువు తగ్గడానికి లైపో సర్జరీ చేసుకున్న ఆర్తి అగర్వాల్ సర్జరీ ఫెయిల్ అవ్వడంతో గుండెపోటుతో మరణించింది. ఆ వార్త అప్పట్లో తెలుగు జనాలను షాక్ కి గురి చేసింది.

అయితే చాలా కాలం తరువాత ఆర్తి అగర్వాల్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్తి జీవితాన్ని సినిమాగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడి దగ్గర సహాయక దర్శకుడిగా పని చేసిన ఒక యువ దర్శకుడు సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. వీలైనంత వరకు ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే బయోపిక్ లో ఎలాంటి అంశాలను చూపిస్తారు అనేది అందరిలో ఒక ఆసక్తిని రేపుతోంది. మరి సినిమాని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.