మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన ఎంత సూపర్ స్టార్ అయినా కూడా ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని స్పెషల్ క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక నేడు రాఖీ పండగా సందర్భంగా మహేష్ తన పిల్లల లవ్లీ ఫోటోలని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
అన్నయ్య గౌతమ్ తో సితారా నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టిట్లో వైరల్ గా మారింది. ఇక మహేష్ అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఘట్టమనేని సోదరి మంజుల కూడా మహేష్, రమేష్ బాబులతో ఉన్న బెస్ట్ ఫోటోలను ట్విట్టట్ లో పోస్ట్ చేసి వారంటే తనకు ఎంతో ఇష్టమని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఘట్టమనేని ఫ్యామిలీ రక్షా బంధన్ వేడుకలతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.