98 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్

ప్రముఖ బిజినెస్‌మెన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఏకంగా 108 కేజీలు తగ్గడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం 18 నెలల్లోనే అనంత్ అంబానీ 108 కేజీలు తగ్గడం అద్భుతమే అని చెప్పవచ్చు. తాజాగా ఒక బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఏకంగా గణేష్ ఆచార్య ఏకంగా 98 కేజీల బరువు తగ్గాడు. ఇప్పుడు స్లిమ్‌గా తయారైన అతడిని చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఇంత బరువు ఎలా తగ్గావు అని అతడిని ప్రశ్నిస్తున్నారు.

ganesh aacharya

గతంలో గణేష్ ఆచార్య 200 కేజీలు ఉండేవాడు. తాజాగా కపిల్ శర్మ నిర్వహిస్తున్న షోకు గణేష్ ఆచార్య హాజరయ్యాడు. ఈ సందర్భంగా స్లిమ్‌గా అయిన ఆయనను చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎంత బరువు తగ్గారని కపిల్ శర్మ ప్రశ్నించగా.. 98 కిలోలు తగ్గానని గణేష్ సమాధానమిచ్చాడు. దీంతో మీలో ఉన్న మరో ఇద్దరు మనుషులను చంపేశారన్న మాట అంటూ కపిల్ ఫన్నీగా కామెంట్ చేశాడు.

ఇంత బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డానని, గత ఏడాదిన్నరగా బరువు తగ్గడానికి ప్రయత్నించానన్నాడు. గణేష్ ఆచార్య చివరిగా తెలుగులో వచ్చిన డీజే సినిమాలోని గుడిలో సాంగ్‌కి డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు.