పవన్ కల్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఖుషి సినిమాతో ఆకాశాన్ని తాకే ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అక్కడి నుంచి వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడిన హీరో. పదేళ్లు హిట్ అనేదే తెలియని హీరో. ఏ సినిమా చేసినా, ఏ దర్శకుడితో కలిసి పని చేసినా హిట్ అనే మాటే వినిపించలేదు. ఇక పవన్ కళ్యాణ్ టైం అయిపొయింది. సినిమాలు మానేయడం బెటర్, ఇంకెన్ని రోజులు అవే సినిమాలు చేస్తాడు, పంథా మారిస్తే హిట్ కొడతాడు. ఇలా ఎవరికి తోచిన సలహా వాళ్ళు, ఎవరికి అనిపించిన విమర్శ వాళ్లు చేశారు. ఆఖరికి అభిమానులు కూడా ఒక్క హిట్టు ఇవ్వు అన్న, తల ఎత్తుకోని తిరగలేక పోతున్నాం అని వాపోయారు. అలాంటి అందరికీ సమాధానం చెప్పిన రోజు, థియేటర్స్ టాప్ లేచిన రోజు, పవన్ కళ్యాణ్ అభిమాని మళ్లీ కాలర్ ఎగరేసిన రోజు… మే 11’ 2012. నాకొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తుంటే, జై పవర్ స్టార్ జై పవర్ జై పవర్ స్టార్ అంటూ థియేటర్ వినిపించిన నినాదాలు ఇంకా సినీ అభిమానుల కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ టైం ఎప్పటికీ అయిపోదు రా, వాడు పవన్ కళ్యాణ్ కేరాఫ్ బాక్సాఫీస్ అని ఆ మే 11 నిరూపించింది.
మిరపకాయ్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ విడుదలై నేటితో 9 ఏళ్లు. ఫస్ట్ సాంగ్ లోనే పవన్ కళ్యాణ్ బెల్ట్ స్టెప్ వేస్తుంటే బాక్సాఫీస్ పాత లెక్కల్ని చెరిపేసుకోవడానికి సిద్ద పడింది. పవన్ కళ్యాణ్ ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’ అనగానే కొత్త రికార్డుల చరిత్ర పుట్టింది. ‘ఒక్క యావరేజ్ సినిమా ఇవ్వండి సూపర్ హిట్ చేస్తాం’ అని ప్రాధేయ పడిన మెగా ఫ్యాన్స్ ఆకలిని గబ్బర్ సింగ్ తీర్చేసింది. యావరేజ్ సినిమా కాదు ఇండస్ట్రీ హిట్ సినిమానే ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఆ సినిమా వచ్చి తొమ్మిదేళ్లు అయినా ఆ జోష్ ఇప్పటికీ అభిమానుల్లో అలానే ఉంది అంటే గబ్బర్ సింగ్ ఇచ్చిన కిక్కు ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్ సింక్ లో పని చేసి ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ ఇస్తే ఎలా ఉంటుందో దానికి ఎగ్సామ్పుల్ గబ్బర్ సింగ్. సాంగ్స్, బీజీఎమ్, ఫైట్స్, కామెడీ… వాట్ నాట్ గబ్బర్ సింగ్ లో అన్నీ స్పెషల్ ఏ, కాదు కాదు గబ్బర్ సింగ్ ఏ స్పెషల్. 9 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో మరోసారి అలాంటి మ్యాజిక్ క్రియేట్ మళ్లీ సృష్టిస్తారేమో చూడాలి.