పూరీ స్పీడ్ మహేష్ అందుకోగలడా?

2020 సంక్రాంతిని సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే మహేష్ తన నెక్స్ట్ సినిమాని ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అఫీషయల్ గా అనౌన్స్ చేశాడు.

Mahesh babu Anil Ravipudi new movie

మహేష్ప త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని డైరెక్టర్ ఏ హింట్ ఇచ్చాడు. అయితే ఇది అతి తక్కువ టైమ్ లో షూట్చేసి… విడుదల చేయటానికి మహేష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ కేవలం 90 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి, విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడే స్పీడ్ మైంటైన్ చేస్తూ జెట్ స్పీడ్ లో షూట్ చేసి మరో హిట్ ఇస్తాడేమో చూడాలి.