National Film Awards: 68వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం చివ‌రి తేదీ..

National Film Awards: భార‌త జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాలు భార‌త్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే సినిమా అవార్డులు. ఈ అవార్డ్స్ భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక‌సారి ప్ర‌క‌టించ‌బ‌డి రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అవార్డు గ్ర‌హీత‌ల‌కు అంద‌జేయ‌డ‌తాయి. అయితే దేశంలోని ప‌లు భాష‌ల చిత్రాల‌ను ప్ర‌త్యేక జ్యూరీ ప‌రిశీలించి ముఖ్య విభాగాల‌లో ఉత్త‌మ‌మైన వాటిని ఎంపిక చేస్తారు.. అలాగే వివిధ భాష‌ల ఉత్త‌మ‌మైన చిత్రాల‌ను కూడా ఎంపిక చేస్తారు.

film awards

National Film Awards ఇక తాజాగా చ‌ల‌న చిత్రోత్స‌వ డైరెక్ట‌రేట్ 2020మార్చి3వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా ఎంట్రీల‌ను ఆహ్వానించింది. 2020జ‌న‌వ‌రి 01నుంచి డిసెంబ‌ర్ 2020 31 మ‌ధ్య‌కాలంలో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ వారు స‌ర్టిఫై చేస్తారు. ఇక ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌డానికి చివ‌రి తేదీ 12మార్చి 2021 సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు.. National Film Awardsఅలాగే ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించిన ఫార‌మ్ యొక్క హార్డ్ కాపీని అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో పాటు స్వీక‌రించ‌డానికి చివ‌రి తేదీ 20 మార్చి 2021. ఇక గ‌మ‌నిక‌: ద‌ర‌ఖాస్తుదారులు స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌లు వెర్ష‌న్లు(ఆన్‌లైన్ మ‌రియు ప్రింటెడ్ హార్డ్ కాపీ) రెండూ ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను స‌మ‌ర్పించే ముందు 2020 జాతీయ 68వ ఫిల్మ్ అవార్డ్స్ రెగ్యూలేష‌న్స్‌ను జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాల‌ని అభ్య‌ర్థించారు.National Film Awards