
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం ‘#CULT’ (కల్ట్). తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండియాలోనే తొలి ‘స్లాషర్ ఫిల్మ్’గా (Slasher Film) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా పవర్-ప్యాక్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
పోస్టర్‌లో సూట్ ధరించి, నోట్లో సిగరెట్.. చేతిలో రక్తంతో తడిచిన గొడ్డలి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ లుక్ చాలా వయోలెంట్ గా, స్టైలిష్ గా ఉంది. కింద రక్తం మడుగులో అడుగులు వేస్తున్న తీరు సినిమాలోని రస్టిక్ అండ్ బోల్డ్ వాతావరణాన్ని తెలియజేస్తోంది. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే టీజర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలతో పాటు జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
కాస్ట్ & క్రూ
- నటీనటులు: ఈ చిత్రం ద్వారా ఏకంగా 40 మంది కొత్త ముఖాలను పరిచయం చేస్తున్నారు. గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తారక్ పొన్నప్ప, కార్తికేయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- డైలాగ్స్: ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్
- సంగీతం: రవి బస్రూర్
- సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: అరవింద్ విశ్వనాథన్ (DOP), రవితేజ గిరిజాల (ఎడిటర్)
- నిర్మాత: సందీప్ కాకర్ల, విశ్వక్ సేన్


