“కిల్లర్” చిత్ర రివ్యూ

సుకు పూర్వాజ్ రచనా దర్శకత్వంలో జ్యోతి పూర్వాజ్ ప్రముఖ పాత్రలో కనిపిస్తూ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం కిల్లర్. ఈ చిత్రంలో సుకు పూర్వాజ్ కీలక పాత్ర చేయడం విశేషం. ఈ సై ఫై థ్రిల్లర్ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలకపాత్రను పోషించారు. ఉర్వీష్ పూర్వాజ్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి జగదీష్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ చేయగా ఆశీర్వాద్, సుమన్ జీవ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
జ్యోతి పూర్వాజ్ రోడ్డుపై స్పృహ తప్పి పడి ఉంటారు. దానికి కారణం పూర్తిగా ఎవరికీ తెలియదు అలాగే ఆమెకు ఒక రక్తం చుక్క కూడా ఉండదు కానీ కోమాలో ఉంటుంది. ఇలా ఉండగా తన తమ్ముడు అక్కను ఎలా అయినా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఒక రోగ్ సైంటిస్ట్ ను కలుస్తారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ఈమె గురించి డిపార్ట్మెంట్ వారు పలు హత్యలలో ఉన్నారని ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. అసలు ఆమె నిజంగా హత్యలు చేశారా? ఆమెను ఆ సైంటిస్ట్ తిరిగి మామూలు మనిషిగా మారుస్తారా? ఆమె తమ్ముడు ఆమె కోసం ఏం చేస్తాడు? అసలు ఆమె ఎవరు? ఏం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన జ్యోతి పూర్వాజ్ ఒకవైపు ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ తో నటించారు. అలాగే విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలో సైంటిస్ట్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా సుకు పూర్వాజ్ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు నటుడుగా కూడా పరిచయం అవుతూ మెప్పించారు. జ్యోతి పూర్వాజ్ కు తమ్ముడుగా నటించిన చందు ఈ సినిమాలో అద్భుతమైన స్క్రీన్ స్పేస్ తో కనిపిస్తూ ఎమోషనల్ సీన్స్ బాగా క్యారీ చేశారు. ముఖ్యంగా తన అక్కను బాగు చేసుకోవడం కోసం ఎంతో తాపత్రయపడే ఒక యువకుడి లాగా కనిపిస్తూ అలాగే మరికొన్ని సీన్స్ లో ఫైట్ చేస్తూ వెండి తెరపై కనిపించిన చందు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అర్చన సింపుల్గా కనిపిస్తూనే తన రెండు పాత్రలకు న్యాయం చేశారు. అలాగే సినిమాలో ఇతర పాత్రలలో కనిపించిన నటీనటులు అందరూ చాలా బాగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
ఈ సినిమా సై ఫై థ్రిల్లర్ అయినప్పటికీ గతంలో వచ్చిన ఇతర సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో కనిపిస్తూ కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే సైన్స్ తో కూడిన కొన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. విఎఫ్ఎక్స్ బాగానే ఉన్నాయి. డబ్బింగ్ సరిగా రాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. బిజిఎం అంతంత మాత్రం గానే ఉంది. ట్విస్టులు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
దర్శకత్వం, నటీనటుల నటన, విఎఫ్ఎక్స్, ట్విస్టులు.

మైనస్ పాయింట్స్ :
డబ్బింగ్, బిజిఎం.

సారాంశం :
ఊహకు అందని ట్విస్టులతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ కూర్చోబెట్టి త్రిల్లర్ గా మిస్ అవ్వకూడని కిల్లర్.

Related Articles

Latest Articles