‘నాగబంధం’ టీజర్ సంచలనం – 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్

అభిషేక్ నామా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. మహా శివరాత్రి పర్వదినాన విడుదలైన ఈ సినిమా టీజర్, దేశవ్యాప్తంగా సినీ ప్రియులను అబ్బురపరుస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్ ట్రెండింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది.

కేవలం ఒక్క రోజులోనే 20 మిలియన్ల వ్యూస్ సాధించి, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ను చాటిచెప్పింది. ఈ చిత్రంలో హీరో విరాట్ కర్ణ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. శివుని అంశతో కూడిన ఆయన అఘోరా లుక్, ఆవేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

దర్శకుడు అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీర్చిదిద్దారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX), బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మరియు సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిని తలపిస్తున్నాయి.

నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైథలాజికల్ ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం, టీజర్ తోనే భారీ అంచనాలను నెలకొల్పింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles