ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘మళ్లీ మళ్లీ’ సాంగ్ రిలీజ్

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ క్రమంలో తాజాగా ‘మళ్లీ మళ్లీ’ పాటను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి విడుదల చేసిన ఈ రొమాంటిక్ మెలోడియస్‌ పాటలో చంద్రహాస్, మేఘన కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది. ఇక ఇందులో ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చిన బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన సాహిత్యం, మహమ్మద్ ఇర్ఫాన్ గాత్రం ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఈ పాటను చూస్తే ఇట్టే ఆకట్టుకునే యుగళ గీతంగా కనిపిస్తోంది.

జయంత్ సి పరాన్జి పాటను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. ”మళ్ళీ మళ్ళీ అంటూ సాగే ఈ పాట బాగుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చిత్రాన్ని చూసి ఆదరించండి. సినిమా టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు.

నటీనటులు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు

సాంకేతిక వర్గం

బ్యానర్ : సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్
నిర్మాతలు : గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్
డైరెక్టర్ : సంపత్ రుద్ర
స్క్రీన్ ప్లే : సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి
కథ : ఎంఏ తిరుపతి
డైలాగ్స్:రమేష్ రాయ్
డీవోపీ :వైఆర్ శేఖర్
మ్యూజిక్ : ఆర్ఆర్ ద్రువన్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
పీఆర్ఓ : సాయి సతీష్

Related Articles

Latest Articles