‘జంగా’ నుంచి మధునందన్ పోస్టర్ విడుదల

శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా వదిలిన ‘జంగా’ పోస్టర్ & మోషన్ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన త్రిగుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న మధునందన్ కారెక్టర్‌ను రివీల్ చేశారు. మధునందన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ పోస్టర్‌లో ఆయన లుక్ చూస్తుంటే ఏదో తదేకంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్ రాజు , రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నటీనటులు : త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్ రాజు , రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు

టెక్నికల్ టీం

బ్యానర్ :ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ
సమర్పణ :శ్రీమతి వనిత కిలారి
నిర్మాతలు : రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి
దర్శకుడు : కెవిన్ గడ్డం(శ్రీహరి)
సంగీతం : కృష్ణ సౌరభ్
కెమెరా : వెంకట్ సి. దిలీప్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : సాయి సతీష్

Related Articles

Latest Articles