
జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “కుకూన్స్”. ఈ చిత్రాన్ని న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మహేశ్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు . యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే మంచి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు “కుకూన్స్” చిత్ర పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. అనంతరం

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “కుకూన్స్” సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. డైరెక్టర్ మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు ఈ పోస్టర్ లో తెలుస్తున్నాయి. టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన వికాస్ గతంలో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు మెంటార్ గా పనిచేశారు. ఇప్పుడీ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్, సాగర్, వికాస్ తో పాటు మిగతా “కుకూన్స్” టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.
నటీనటులు – జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి, తదితరులు
టెక్నీషియన్స్
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీశైలం
ఎడిటర్ – ఆదిత్య తివారి
డీవోపీ – నిఖిల్ శ్యామ్
మ్యూజిక్ డైరెక్టర్ – బి.ఎన్.ఆదిత్య
బ్యానర్స్ – న్యూ వేవ్ పిక్చర్స్, ఎం. ఆర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్స్ – సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి
స్క్రిప్ట్, డైరెక్షన్ – మహేశ్ గౌరి
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్.మీడియా)


