
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, వికలాంగుల సంస్థ చైర్మన్‌గా పనిచేసిన పిన్నమనేని సాయిబాబు (69) హైదరాబాద్‌లోని తన నివాసంలో అకస్మాత్తుగా మరణించారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశారని తెలుస్తోంది.

ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన మొదటి తరం వీరసైనికులలో ఒకరైన సాయిబాబు, అభిమానిగా, కార్యకర్తగా పార్టీకి, ఎన్టీఆర్‌కు అపార సేవలందించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుండి నడిపించిన ఆయన మరణం అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున, నందమూరి కుటుంబం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పసుపు కార్యకర్త, నందమూరి రామకృష్ణ తెలిపారు.


