ఈషా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ముగింపు.. జాతీయ స్థాయికి విజేతల అర్హత

ఆంధ్రప్రదేశ్‌లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈషా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు కేఎల్ యూనివర్సిటీలో ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన జట్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాయి.

ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల వాలీబాల్ ఫైనల్ మ్యాచ్‌లో ఏలూరు జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి కాకినాడ జట్టును ఓడించి రాష్ట్ర విజేతగా నిలిచింది. కాకినాడ జట్టు రన్నరప్‌గా నిలవగా, విశాఖపట్నం జట్టు మూడో స్థానం, రాజమండ్రి జట్టు నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

అదేవిధంగా మహిళల త్రోబాల్ ఫైనల్ పోటీలో విశాఖపట్నానికి చెందిన శ్రీరామ జట్టు, అదే నగరానికి చెందిన ఆంజనేయ జట్టుపై విజయం సాధించి రాష్ట్ర ఛాంపియన్‌గా అవతరించింది.

ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు వచ్చే సెప్టెంబర్‌లో తమిళనాడులోని కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలోని ఆదియోగి ప్రాంగణంలో సద్గురు సమక్షంలో జరిగే జాతీయ స్థాయి ఈషా గ్రామోత్సవం క్రీడా పోటీల్లో పాల్గొననున్నాయి.

ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు వెల్లువెత్తగా, జాతీయ స్థాయిలో కూడా వారు ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

Related Articles

Latest Articles