సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ – రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వ హామీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల తదితరులు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 24 క్రాఫ్ట్స్‌లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

అలాగే, ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్క్రిప్ట్‌తో వచ్చిన వారికి సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా ప్రోత్సాహం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ భేటీతో సినీ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

Related Articles

Latest Articles