మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న రానుందా?

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతి దేశంలో తెలియని వారు ఉండరు. నటన మీద ఆయనకున్న మక్కువతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సుమారు నాలుగు శతాబ్దాలుగా అగ్ర హీరోగా టాలీవుడ్ లో రాణిస్తూ 150 పైగా సినిమాలలో నటించడమే కాక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు వంటి సమాజ సేవలో తనదైన ముద్రను వేసుకుంటూ ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు. అంతేకాక డాక్టరేట్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అటువంటి చిరంజీవి గారికి అతి త్వరలోనే భారతరత్న కూడా వస్తుందంటూ టాలీవుడ్ అగ్ర నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అన్నారు.

ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన కె రాంప్ చిత్రం గొప్ప విజయం సాధించడంతో నేడు ఆ చిత్ర బృందమంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ను బండ్ల గణేష్ తన పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్ని హిట్టులు కొట్టిన చాలా సాధారణంగా ఉంటూ ఒక సామాన్యుడిలా చిత్ర పరిశ్రమకు వచ్చి నేడు ఉన్నత స్థాయికి చేరడం చాలా గొప్ప విషయమని, ఆరుగురు కొత్త దర్శకులను పరిశ్రమకు అందించడం చాలా మంచి విషయమని ఆయన అన్నారు. అంతేకాక ఒక్క హిట్ కొట్టిన వెంటనే ఎంతో విజయం సాధించినట్లు ఫీల్ అయ్యే ఈ పరిశ్రమలో ఇన్ని హిట్టులు బట్టి కూడా చాలా కూల్ గా కిరణ్ ఉంటారని అన్నారు. చిరంజీవి గారు కూడా ఇలాగే కిరణ్ ల ఉండేవారని, తనకు కిరణ్ ను చూస్తుంటే త్వరలోనే భారతరత్న తీసుకునే చిరంజీవి గారు గుర్తొస్తున్నారని అన్నారు.

అయితే బండ్ల గణేష్ వ్యాఖ్యలలో చిరంజీవి గారికి భారతరత్న వస్తుందనడంతో ఇంటర్నెట్ అంతట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే చిరంజీవి గారికి ఎన్నో జాతీయస్థాయి పురస్కారాలు లభించగా ఇక మిగిలి ఉన్నది ఎంతో ఉన్నత స్థాయి కలిగిన భారతరత్న మాత్రమే అని, ఆ అవార్డు కూడా చిరంజీవి గారికి కచ్చితంగా వస్తుందంటూ నేటిజెన్లు వాపోతున్నారు.

Related Articles

Latest Articles