
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దశరథంలో త్వరలో మరొక చిత్రం రానుందని వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో వీడి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో చిత్రం వస్తుందని వార్త మెగా అభిమానులను ఎంతో ఆనందపరిచింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి గారికి ఆపోజిట్ గా తమిళ నటుడు అనురాగ్ కాశ్యప్ ను నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం అనురాగ్ కాశ్యప్ మాత్రమే ఈ పాత్ర చేయాలని బాబి ఆయన కోసం ప్రత్యేకంగా ఈ పాత్రను రాసినట్లు సమాచారం. అయితే ఇదే టాలీవుడ్ లో అనురాగ్ కాశ్యప్ కు తొలి చిత్రం కావడంతో ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవతారేమో చూడాలి. గతంలో విజయ సేతుపతి కథానాయకుడిగా వచ్చిన మహారాజా చిత్రంతో అనురాగ్ కాశ్యప్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా సంగతి అందరికీ తెలిసిందే.


