
హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్స్ పథకంపై టి సిరీస్ సమర్పణలో నవీన్ ఎర్నేని, రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఫౌజీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపం కేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, భానుచందర్ తదితరులు కీలకపాత్రలు పోసేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ చిన్ననాటి పాత్రను టాలీవుడ్ అగ్ర హీరోలలోని ఒక నటుడి కుమారుడు పోషించనున్నట్లు బజ్ వినిపిస్తుంది. టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు చిన్న కుమారుడు ఫౌజీ చిత్రంలో ప్రభాస్ చిన్ననాటి పాత్రను పోషించనున్నట్లు సినీ వర్గాలలో ఎంతగానో వినిపిస్తున్న వార్త. ఈ వార్త నిజమైతే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి కాకుండా అటు సుధీర్ బాబు, మహేష్ బాబు అభిమానుల నుండి కూడా ఈ చిత్రానికి మరింత సపోర్టు లభిస్తుందని అర్థమవుతుంది. అయితే ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా నెట్లో అది ఎంతో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్ర తదుపరి అప్డేట్ల కోసం వేచి చూడాల్సిందే.
కాగా ఇటీవలే ఒకసారి సుధీర్ బాబు పెద్ద కొడుకు ఒక ఫంక్షన్కు అటెండ్ కాగా అక్కడి వీడియోలు ఎంతో మారాయి. చూపులకు సుధీర్ బాబు లా ఉన్నప్పటికీ తన నడక ఇంకా ఇతర మ్యానిజం అంతా మహేష్ బాబు పోలికలతో ఉండడంతో మేనమామ పోలికలు బాగా వచ్చాయని, భవిష్యత్తు టాలీవుడ్ సూపర్ స్టార్ అతనే కావచ్చని మహేష్ బాబు ఫ్యాన్స్ సుధీర్ బాబు పెద్దకొడుకు ఫోటోను ఎంతగానో వైరల్ చేశారు.


