
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర: పార్ట్ 1’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. 2024 సెప్టెంబర్ 27న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. సినిమా చివరిలో సీక్వెల్ ఉంటుందని ఎండ్ కార్డ్స్‌లో ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో కొంత నిరాశ నెలకొంది. అయితే, చిత్రం విడుదలై ఏడాది తిరిగిన సందర్భంగా NTR ఆర్ట్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. “దేవర తాండవానికి ఏడాది పూర్తైంది. దేవర 2 కోసం సిద్ధంకండి!” అని ట్వీట్ చేసి, ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.


