
‘మాస్ గాడ్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను నాల్గవ సారి కలిసి ‘అఖండ 2: తాండవం’తో రభస సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. బాలకృష్ణ తన డబ్బింగ్ పూర్తి చేశారు. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి. సీజీ, రీ-రికార్డింగ్ పనులు ఈ నెలాఖరులో పూర్తిచేసుకుని మరో మూడు వారాల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది.
ఈ చిత్రం దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. బాలకృష్ణ కొత్త అవతారంలో అభిమానులను ఉర్రూతలూగించింది. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి.
ప్రమోషన్స్‌ను మరింత ఉధృతం చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. ‘అఖండ 2: తాండవం’ మరో బ్లాక్‌బస్టర్‌గా అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.


