‘అమీర్ లోగ్’ నుంచి ‘బజారే బ్యాన్జో’ సాంగ్ రిలీజ్

పక్కా లోకల్, హైదరబాద్‌ గల్లీని, బస్తీని తెరపై చూపించేందుకు ‘అమీర్ లోగ్’ చిత్రం రాబోతోంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగీ కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు.

వరుసగా పాటల్ని రిలీజ్ చేస్తూ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. హైదరబాద్ లోకల్ ఫ్లేవర్‌ను చూపిస్తూ వస్తున్న పాటలు, ర్యాప్ సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘బజారే బ్యాన్జో’ అనే హిందీ ర్యాప్ పాటను వదిలారు. ఇక ఇది హైదరబాద్ యూత్‌కు ప్రతీకగా నిలిచేలా ఉంది. ఈ పాటలో హైదరాబాద్ సంస్కృతిని, గల్లీ, బస్తీ యువతను చక్కగా చూపించారు. ఈ హిందీ ర్యాప్ పాటకు డబుల్ ఈ (వసీం) సాహిత్యాన్ని, గాత్రాన్ని అందించారు. షబాజ్ ఖాన్ వాయిస్ ఈ పాటకు ఆకర్షణను జోడించింది. స్మరణ్ సాయి బాణీ క్యాచీగా ఉంది. ఇక ఈ పాటను హైదరాబాద్ యూత్ ఆంథమ్‌గా మార్చేలా ఉన్నారు.

పక్కా లోకల్ ఫ్లేవర్‌తో హైదరాబాద్‌‌లోని ఇంకో కోణాన్ని ఆవిష్కరించేలా ‘అమీర్ లోగ్’ ఉండబోతోంది. యువతకు మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించిన ఈ మూవీకి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

తారాగణం : MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు: రమణారెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి
రిలీజ్: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP: SVK
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్లు: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ AD: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
PRO: సాయి సతీష్

Related Articles

Latest Articles