గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాయగా ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

సెప్టెంబర్ 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. కర్ణాటకలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ ఇంకా ట్రైలర్ అద్భుత స్పందన రావడంతో మేకర్స్ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు.

Related Articles

Latest Articles