ఆసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సెప్టెంబర్ 5న విడుదల కానున్న “భద్రకాళి”

మార్గన్ సినిమా విజయం తర్వాత, విజయ్ ఆంటోనీ మరో ఆసక్తికర చిత్రం ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రాజకీయ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కోపం, తిరుగుబాటు, అవినీతి వ్యవస్థను ధ్వంసం చేసే తపన థీమ్‌లతో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో తెలుగులో విడుదల చేస్తోంది.

విజయ్ ఆంటోనీతో పాటు వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలని, తృప్తి రవీంద్ర, కిరణ్, రియా జితు, మాస్టర్ కేశవ్ తదితరులు నటిస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ సినిమాటోగ్రఫీ, విజయ్ ఆంటోనీ సంగీతం, రేమండ్ డెర్రిక్ ఎడిటింగ్, రాజశేఖర్ యాక్షన్, శ్రీరామన్ ఆర్ట్ డైరెక్షన్, రాజశేఖర్ రెడ్డి తెలుగు సంభాషణలతో సాంకేతిక బృందం ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.

త్వరలో హై-వోల్టేజ్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

Related Articles

Latest Articles