
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా షూటింగ్‌లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హీరో, హీరోయిన్‌కు గాయాలు అయినట్లు సమాచారం. అయినప్పటికీ, వారు గాయాలను లెక్కచేయకుండా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడటంతో అడవి శేష్, మృణాల్ ఠాకూర్‌లకు గట్టి గాయాలు అయినట్లు టాక్. ముఖ్యంగా అడవి శేష్ కాలు బాగా వాచిపోవడంతో కొద్దిసేపట్లో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
‘డెకాయిట్’ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతోంది. మొదట ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనప్పటికీ, రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో చేరారు.
అడవి శేష్ ఈ సినిమాతో పాటు ‘గూఢచారి-2’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన శేష్, విభిన్న కథల ఎంపికతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


