18 నెలల పాటు సెక్స్‌కు దూరంగా ఉన్నా

18 నెలల పాటు సెక్స్‌కు పూర్తిగా దూరంగా ఉన్నానని చెబుతోంది ఈ హాట్ సింగర్ సోఫియా హయత్. బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేసిన హిందీ బిగ్‌బాస్-7లో కంటెస్టెంట్‌గా ఈమె పాల్గొంది. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ఈ హాట్ సింగర్ ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటూ ఉంటుంది. హాట్ ఫొటో షూట్స్, వీడియోలు పెడుతూ నెట్టింట్లో హాల్ చల్ చేస్తూ ఉంటుంది. . దాదాపుగా రెండేళ్ల పాటు సోఫియా నన్గా సోఫియా కొనసాగింది. మళ్లీ ఈ మధ్య సాధారణ డ్రస్సింగ్‌లో కనిపిస్తోంది.

sofia hayat

అయితే బాలీవుడ్ నటి సనా ఖాన్ కూడా గతంలో సన్యాసంను వదిలేసి పెళ్లి చేసుకుంది. దీంతో వీరిద్దరిని పోలుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీంతో సనాఖాన్‌తో పోలుస్తూ తనను ట్రోల్ చేస్తున్న వారికి సోఫియా వార్నింగ్ ఇచ్చింది.

తాను నన్‌గా ఉన్న 18 నెలల పాటు సెక్స్‌కు పూర్తగా దూరంగా ఉన్నానని, ఇప్పుడు తాను నన్‌గా డ్రస్ వేసుకోనంత మాత్రాన తనలో ఆధ్యాత్మిక చింతన తగ్గిందని ఎల అనుకుంటారని తెలిపింది. తాను ఇంకా సన్యాసిగానే ఉన్నానని, తనను ఒంటరిగా వదిలేయండి అని కోరింది. ఇతరులతో తనను పోల్చి చిరాకు పెట్టవద్దని హెచ్చరించింది. వేసుకునే డ్రస్‌ని బట్టి ఆధ్యాత్మికత ఎలా వస్తుందని ప్రశ్నించింది.