ఆదిపురుష్‌కి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రత్యేక సెట్‌లో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్దే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

ADIPURUSH

అయితే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాడ్ ఇండియా మూవీ ఆదిపురుష్‌లో ప్రభాస్ నటించనున్నాడు. ఇందులో ప్రభాస్ రాముడగా కనిపించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. సీత పాత్ర కోసం దీపికా పదుకొణే పేరు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ప్రభాస్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటా ఇస్తామని ప్రభాస్‌కి నిర్మాతలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.