రెస్టారెంట్‌లో ప్లేట్లు పగలకొట్టిన బాలీవుడ్ స్టార్ హీరో చెల్లి

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లి అర్పిత ఖాన్ ఒక రెస్టారెంట్‌లో ప్లేట్లు పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా అర్పిత ఖాన్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ గత కొద్దిరోజులుగా ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా తాజాగా దుబాయ్‌లో ఉన్న ఒక గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ప్లేట్లు పగలగొట్టింది.

salmankhan

గ్రీకు రెస్టారెంట్లలో ప్లేట్లు పగలగొట్టడం అనేది సాంప్రదాయం. ప్లేట్లు పగలగొడితే దుష్టశక్తులు దూరంగా వెళ్లిపోతాయని గ్రీకు పురాణాల్లో ఉందట. అందుకే గ్రీకు రెస్టారెంట్లకు వెళ్లినవారు ప్లేట్లు పగలగొడతారు. అందులో భాగంగా అర్పిత ఖాన్ ఇలా చేసినట్లు చెబుతున్నారు. టేబుల్‌పై అమర్చిన ప్లేట్లను ఆమె పగలగొడుతూ ఎంజాయ్ చేసినట్లు వీడియోలో కినిపిస్తోంది.

అయితే సల్మాన్ ఖాన్‌కు అర్పిత ఖాన్ సొంత చెల్లి కాదు. సల్మా ఖాన్ ఈమెను దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక సల్మాన్ సవతి తల్లి హెలెన్.. ఒక వీధిలో వెళ్తుతుండగా అర్పిత ఏడుస్తూ కనిపించిందని, దాంతో ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నట్లు మరో వార్త కూడా ఉంది.