రాంచరణ్‌కు జోడీగా మరో బాలీవుడ్ బ్యూటీ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాంచరణ్ పక్కన ఎవరు నటిస్తారనేది క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. రాంచరణ్ పక్కన రష్మికను తీసుకోవాలని తొలుత సినిమా యూనిట్ భావించినట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో రాంచరణ్‌కు జంటగా కియారా అద్వానీని తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

kiara advani

దీనిపై త్వరలో ఆచార్య సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రాంచరణ్ నటిస్తుండగా.. ఇటీవల రాజమౌళి నుంచి రాంచరన్ పర్మిషన్ తీసుకుని ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో ఆచార్య షూటింగ్ జరుగుతోంది.

త్వరలో రాంచరణ్ ఈ షూటింగ్‌లో పాల్గొనున్నారని సమాచారం. ఈ సినిమాలో రాంచరణ్ పాత్రకథను మలుపు తిప్పేలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రెజీనాను తీసుకునేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనట. కొడిణెదల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను తెరెక్కిస్తున్నాయి. ఇప్పటికే RRR సినిమాలో చెర్రీకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఇప్పుడ ఆచార్యలో కూడా బాలీవుడ్ భామ నటిస్తుండటం గమనార్హ:.