క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమంటున్న హీరోయిన్ నేహా శెట్టి !!

డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. యూత్ ఆడియెన్స్ లో రాధికగా ఫేమ్ అయ్యింది. కావాల్సినంత క్రేజ్ ఉన్నా…వరుసగా సినిమాలు చేయడం లేదు నేహా శెట్టి. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని చెబుతుందీ యంగ్ స్టార్ హీరోయిన్. మంచి సినిమాలు చేసి, మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేహా శెట్టి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో 4 నెలల కోర్స్ చేసింది నేహా శెట్టి. నటిగా తనను తాను మెరుగుపర్చుకోవడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడిందని నేహా శెట్టి చెబుతోంది. నేహా శెట్టి మాట్లాడుతూ – నటిగా వైవిధ్యంగా కనిపించాలి, భిన్నమైన క్యారెక్టర్స్ లో నటించాలనే నా ప్రయత్నానికి న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో చేసిన కోర్స్ బాగా హెల్ప్ అవుతోంది. ఈ కోర్స్ ద్వారా నేర్చుకున్న విషయాలతో నటిగా మరింత మెరుగయ్యాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బుజ్జి పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. అని చెప్పింది.

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.