సల్మాన్ సరసన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్

‘కంచె’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైశ్వాల్.. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. చాలా సినిమాల్లో నటించినా.. తెలుగులో స్టార్‌డమ్‌ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న BB3లో ప్రగ్యాజైశ్వాల్ నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా బాలీవుడ్‌లో స్టార్ హీరో సరసన ఆఫర్ కొట్టేసింది.

PRAGYA CHANCE IN SALMAN MOVIE

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ప్రస్తుతం అంతిమ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ప్రగ్యా పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. ఇందులో సల్మాన్ పోలీస్ పాత్రలో నటించనున్నాడు. సల్మాన్ సరసన అవకాశం దక్కడంతో.. ప్రగ్యా జైశ్వాల్ ఎగిరి గంతేస్తోంది.