ఆచార్య సెట్‌లోకి వెళ్లిన తెలంగాణ మంత్రి

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. శుక్రవారం విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టిస్తోంది. ప్రస్తుతం 7 మిలియన్ల వ్యూస్‌లో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. దీని కోసం హైదరాబాద్ శివారులోని కోకాపేటలో అతిపెద్ద భారీ సెట్‌ను మేకర్స్ వేశారు. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ భారీ సెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివతో మాట్లాడారు.

puvvada in acharya set

సినిమా యూనిట్‌కి పువ్వాడ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆచార్య సెట్‌ను సందర్శించి చిరు, కొరటాల శివతో మాట్లాడిన ఫొటోలను పువ్వాడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.