శశికళగా రేణుదేశాయ్

వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో శశికళ పేరుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ కలకలం రేపుతోంది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికలకు ముందే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో శశికళ పాత్రను పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పోషించనున్నట్లు తెలుస్తోంది.

జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ పేరుతో డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజే శిశికళ సినిమా కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముందే విడుదల కానున్న ఈ సినిమాలు తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతాయనేది ఉత్కంఠభరితంగా మారింది.

తలైవి సినిమాలో జయలలిత పాత్రను బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పోషిస్తుండగా.. దీని కోసం కంగనా 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఈ సినిమా కోసం కంగనా రనౌత్ భరతనాట్యం కూడా నేర్చుకుంది.