దృశ్యం-2 తెలుగు రీమేక్‌కి రెడీ

మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమా తెలుగులోకి రీమేక్ అయి ఇక్కడ కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వెంకటేష్ ఇందులో హీరోగా నటించగా.. మీన, నదియా కీలక పాత్రలలో నటించారు. అయితే ఇప్పుడు మలయాళంలో దృశ్యం 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

venkatesh drushyam 2

ఇప్పుడు తెలుగులోనూ దృశ్యం2 తెలుగు రీమేక్‌కి రంగం సిద్ధం అవుతోంది. ఇందులోనూ వెంకటేష్ హీరోగా నటించగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే నారప్ప షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలు పూర్తైన తర్వాత దృశ్యం 2 ప్రారంభం కానుందని తెలుస్తోంది.