Tamannaah: చెమ‌టోడుస్తున్న త‌మ‌న్నా.. నెటిజ‌న్లు ఫిదా!

Thamanna: మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా త‌న ఫిట్‌నెస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇక త‌న అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌లే తాను క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. అనంత‌రం త‌మ‌న్నా జిమ్‌లో ఎక్కువ సేపు వ‌ర్కౌట్ చేస్తూ.. మ‌రింత అందంగా త‌యారైంది. దీంతో జిమ్‌లో చేస్తున్న త‌మ‌న్నాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారి.. కుర్ర‌కారును వేడిక్కిస్తున్నాయి.

thammmu

ఇక తాజాగా Thamanna త‌మ‌న్నా జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మ‌న‌సు న‌మ్మేదానిని శ‌రీరం ఆచ‌ర‌ణ‌లో పెట్టి, దానిని సాధిస్తోంది అంటూ మిల్క్‌బ్యూటి రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం జిమ్‌లో చెమ‌ట చిందిస్తున్న Thamanna త‌మ‌న్నా ఫోటోను చూసి.. వ‌య్యారి నాజూకు న‌డుం అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక త‌మ‌న్నా ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఎఫ్‌3 చిత్రంలో వెంక‌టేశ్ జోడీగా న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో అంద‌ధున్ బోలే చుడియ‌న్ సినిమాల్లో బోల్డ్‌గా న‌టిస్తోంది. ఇక Thamanna తాను న‌టించిన సీటిమార్ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుంది. ఇందులో గోపీచంద్ హీరోగా న‌టిస్తుండ‌గా.. సంప‌త్‌నంది ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.