ఛలో గోవా…

ఒక సినిమా కథని రాయడంలో ఒక్కో డైరెక్టర్, రైటర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే ఈ విషయంలో డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాధ్ స్టైల్ ఏంటి అంటే బ్యాంకాక్ వెళ్లడం. ఎన్నో హిట్ సినిమా కథలని పూరి బ్యాంకాక్ బీచుల్లోనే కూర్చొని రాశాడు. అప్పుడప్పుడు బ్యాంకాక్ కాకుండా గోవా కూడా వెళ్లే పూరి, ఈసారి విజయ్ దేవరకొండ కోసం కూడా గోవాకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పూరి ఫైటర్ అనే సినిమా చేయనున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కథని బౌండ్ స్క్రిప్ట్ చేయడానికి పూరి గోవా వెళ్తున్నాడు. వారం పది రోజుల్లో కథని రాసే పూరి, బౌండ్ స్క్రిప్ట్ తోనే గోవా నుంచి తిరిగి వస్తాడని అంటున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ చేస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా పూర్తికాగానే, పూరి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.