మొక్కకి మందు పోయడం ఏంటి బాసు?

rx 100 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న హీరో కార్తికేయ, రీసెంట్ గా గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. గ్యాంగ్ లీడర్ రిజల్ట్ లో కార్తికేయ పాత్ర కూడా చాలా ఉంది. ఇక మళ్లీ హీరోగా కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 90ml. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకుంది. అశోక్ గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల 35 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కార్తికేయ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఎవరినో చూస్తున్న కార్తికేయ, తన ముందు ఉన్న బోన్సాయ్ మొక్కకి ప్లాంట్ కి నీళ్లకి బదులు మందు పోస్తూ ఉన్నాడు. టైటిల్ తగ్గట్లు డిజైన్ చేసిన పోస్టర్ కొత్తగా ఉంది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.