మార్చి 19న ‘జీ 5’లో ‘నిన్నిలా నిన్నిలా’ ప్రీమియర్!!

తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్‌ సినిమాలు, ఒరిజినల్స్‌తో వీక్షకులకు ఎంతో వినోదం అందిస్తున్న ఓటీటీ వేదిక జీ5. తాజాగా మరో క్రేజీ సినిమాను వీక్షకుల ముందుకు తెస్తోంది.

అశోక్ సెల్వన్, నిత్యా మీనన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కొన్ని వారాల క్రితం ‘జీ ప్లెక్స్’లో విడుదలైంది. ప్రజల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడీ సినిమా మార్చి 19 నుంచి ‘జీ 5’లో ప్రీమియర్ కానుంది. వీక్షకుల కోసం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం – నాలుగు దక్షిణాది భాషల్లో సినిమాను అందుబాటులోకి తెస్తున్నారు.

ఫిబ్రవరిలో ‘జీ ప్లెక్స్’లో స్ట్రీమింగ్ అయిన ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. విమర్శకుల నుంచి, వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి, జీ స్టూడియోస్ సంస్థలు తెరకెక్కించాయి. బాపినీడు .బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు.

కీలక పాత్రలో నాజర్, ఫన్నీ కుక్‌గా కమెడియన్ సత్య నటించిన ఈ ప్రేమకథా సినిమా లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ మురుగేశన్, సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, సాహిత్యం: శ్రీమణి, మాటలు: నాగ చంద్ర, జయంత్ పానుగంటి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగల, ఎడిటింగ్: నవీన్ నూలి.