Salaar: ప్ర‌భాస్ స‌లార్ ఐటెం సాంగ్‌లో చిందేయ‌నున్న‌ కేజీఎఫ్ ఫేం శ్రీ‌నిధి శెట్టి..

Salaar: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్‌, కెజీఎఫ్ ఫేం డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌ల్మే ఫిల్మ్ బ్యాన‌ర్‌పై కిరంగ‌దూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంట్లో ప్ర‌భాస్ లుక్ ప్రేక్ష‌కుల‌ను, ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి..దీంతో ఈ Salaar సినిమా అప్‌డేట్ కోసం ఎంతాగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ చ‌క్క‌ర్లు కొడుతుంది.

salaar itemsong

ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అందాల‌ను ఆర‌బోయ‌నుందట‌ కేజీఎఫ్ ఫేం హీరోయిన్ శ్రీ‌నిధిశెట్టి. ప్ర‌భాస్‌తో చిందులు వేయ‌నుందన‌ట శ్రీ‌నిధి. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కానీ ఈ విష‌యంపై అధికారికంగా మాత్రం చిత్ర‌బృందం వెల్ల‌డించ‌లేదు. ఇక ఈSalaar చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ఇటీవ‌లే చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.