‘జీబ్రా’ సినిమా రివ్యూ

ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజా ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఎస్ ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా ఈశ్వర్ కార్తీక్ రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జీబ్రా. ఈ చిత్రంలో సత్యదేవ్ కథానాయకుడిగా, ప్రియా భవాని శంకర్ కథానాయకగా నటించడం జరిగింది. సత్యరాజ్, డాలి ధనంజయ, సునీల్, సత్య తదితరులు కీలక పాత్ర ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. సత్య పాన్మర్ ఈ చిత్రానికి డిఓపిగా పని చేయగా అనిల్ క్రిష్ ఎడిటింగ్ పని చేశారు. ఇక ఏ చిత్రం ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ:

సత్యదేవ్ ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. అదే బ్యాంకులో తన మిత్రుడు సత్యా కూడా పనిచేస్తాడు. ఒకప్పుడు వేరే బ్యాంకులో పనిచేస్తూ తర్వాత ఇదే బ్యాంకులో ఉద్యోగంలో సత్యదేవ్ ప్రేయసి అయిన ప్రియా భవాని శంకర్. స్నీక్ పిక్ వీడియోలో చూపించినట్లు ప్రియా భవాని శంకర్ గత బ్యాంకులో పనిచేస్తుండగా జరిగిన ఓ తప్పిదాన్ని సత్యదేవ్ తన తెలివితేటలతో ఆ సమస్య నుండి బయటపడేయడం జరుగుతుంది. అయితే అంతటితో ఆ సమస్య తీరుతుందా లేదా? నీ జీవితాల్లోకి డాలి ధనంజయ ఎందుకు వస్తాడు? సునీల్ కు దాలిధనంజయకు సంబంధం ఏంటి? సత్యరాజ్ ఈ కథలోకి ఎలా వస్తాడు? డబ్బు చుట్టూ తిరిగే ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి? చివరికి ఈ ట్విస్టులు దాటుకుని ఏం జరుగుతుంది? మన విషయం తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి ధరపై చూసి తేడాల్సిందే.

నటినటుల నటన:

చిత్రంలో సత్య దేవ్, డాలి ధనంజయ నటన చిత్రానికి చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. సత్య తన కామిడీ టైమింగ్స్ తో, ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో తరలించారు. ప్రియ భవాని శంకర్, సత్య రాజ్ తమ పరిధిలో తాము నటిస్తూ చిత్రంలోని సీన్స్ ను బాగా పండించారు. అదేవిధంగా చిత్రంలోని పలు పాత్రలు తమ పరిధిలో నటిస్తూ చిత్రానికి మరింత ఉపయోగపడ్డారు.

సాంకేతిక విశ్లేషణ:

కథ, దర్శకత్వంలో దర్శకుడు విజయం సాధించాడు కానీ స్క్రీన్ లో విషయంలో కొంచెం వెనుకబడినట్లు అర్థమవుతుంది. చిత్రం కొంచెం టెక్నికల్ ఎక్స్ప్రెస్ తో ఉండటంతో కొంచెం వేగంగా అనిపించింది. అంతేకాక బ్యాంకు సంబంధించిన కొన్ని టెక్నికల్ పదాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థం అయ్యేవిధంగా లేకపోవడం ఒక మైనస్. పని నటీనటుల నటన కానీ, బిజీఎం, ఫైట్స్, ట్విస్ట్ తదితర విషయాలలో ఎటువంటి లోటు లేకపోవడం చిత్రానికి మంచిది అయింది. అదేవిధంగా నిర్మాణ విలువలు విషయంలో ఎక్కడ కాంప్రమైస్ కానట్లు కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

కథ, నటీనటులు నటన, మ్యూజిక్, ఫైట్స్, ట్విస్టులు.

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే వేగంగా ఉండటం, కొన్ని అర్థం కాని పదాలు.

సారాంశం:

ఈ చిత్రం ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడేవారికి ఎంతగానో నచ్చుతుంది. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా చెప్పుకోవచ్చు.