యంగ్ హీరో నాగ శౌర్య కంప్లీట్ మేకోవర్ తో అయ్యి ముందెన్నడూ లేనంత కొత్తగా కనిపిస్తున్నాడు. రాక్ సాలిడ్ ఫిజిక్ తో, లాంగ్ హెయిర్ పెంచుకున్న శౌర్య, సినిమా కోసం తాను ఎంత కష్టపడడానికి అయినా రెడీ అని ప్రూవ్ చేశాడు. ఇండియాలో ముందెన్నడూ రాని ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. రామ్ మోహన్ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న శౌర్య, కరోనా కారణంగా ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ సెట్స్ పైకి వెళ్లారు.
##NS20గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని శరత్ మరార్ ప్రొడ్యూస్ చేస్తుండగా, కీరవాణి కొడుకు కాల భైరవ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఛలో సినిమా తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ శౌర్య, ఈ ఆర్చరీ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పోస్టర్ అండ్ మేకోవర్ తో మెప్పించిన నాగ శౌర్య సినిమాతో కూడా మెప్పించి సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.