స్పీడ్ పెంచిన సూర్య నెక్స్ట్ మూవీ అప్డేట్స్…

కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో సూర్య స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ఆకాశం నీ హద్దురా సినిమాని ఆన్లైన్ రిలీజ్ కి రెడీ చేసిన సూర్య, నెక్స్ట్ సినిమాని వెట్రిమారన్ తో అనౌన్స్ చేశాడు. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాకి వాదివాసల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఒక సినిమా అయ్యాకే ఇంకో సినిమాని చేసే సూర్య, ఈసారి మాత్రం వాదివాసల్ తో పాటు మరో సినిమాని కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు.

మాధవన్ నటిస్తున్న రాకెటరి ఎఫెక్ట్ సినిమాలో కూడా క్యామియో ప్లే చేస్తున్న సూర్య, తన నెక్స్ట్ సినిమాని యంగ్ డైరెక్టర్ పాండిరాజ్ తో ప్లాన్ చేశాడు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన పాండిరాజ్ చెప్పిన కథకి ఓకే చెప్పిన సూర్య, వాదివాసల్ తో పాటు ఈ ప్రాజెక్ట్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేలా ఆలోచన చేస్తున్నాడట. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఇంకా సెట్స్ కి వెళ్లక ముందే సూర్య, మరో డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2018లో జయం రవితో అడంగ మారు సినిమా చేసిన మంచి హిట్ అందుకున్న కార్తీక్ తంగవేల్ సూర్య కాంబినేషన్ సెట్ అవుతుందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి కానీ ఇప్పటివరకైతే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.