మేజర్ సినిమా కోసం అడివి శేష్ సిక్స్ ప్యాక్ చేస్తాడా?

క్ష‌ణం, అమీతుమీ, గూఢ‌చారి రీసెంట్‌గా ఎవ‌రు సినిమాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న హీరో అడివిశేష్‌. ఇప్పుడు ఈయ‌న త‌దుప‌రి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. భార‌త ప్ర‌భుత్వం నుండి అశోక్ చ‌క్ర అవార్డును గెలుచుకున్న ఉన్నికృష్ణ‌న్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం మేజ‌ర్‌. ఇందులో అడివిశేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్‌, జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

adivi sesh

26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం సినిమా స్క్రిప్టింగ్ ద‌శ‌లో ఉంది. పాత్ర కోసం అడివిశేష్ ప‌ది కిలోల బ‌రువు త‌గ్గుతున్నాడు. అందుకోస‌మ‌ని స్ట్రిట్ డైట్ ప్లానింగ్ చేసుకున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతానికి సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.