నెక్స్ట్ సినిమాలో బన్నీ తెలుగు తమిళ అభిమానులకి మెప్పిస్తాడా?

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్వరలో సౌత్ సెన్సేషన్ మురుగ‌దాస్‌తో సినిమా చేయనున్నాడు అనే వార్త చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ర‌జ‌నీకాంత్‌తో ద‌ర్బార్ సినిమాను తెర‌కెక్కిస్తున్న మురుగదాస్, వచ్చే సంక్రాంతికి ఫ్రీ అయిన తర్వాత బన్నీ సినిమా కోసం కథ మొదలుపెట్టే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే కేరళలో ఫాలోయింగ్ పెంచుకున్న బ‌న్నీ కూడా త‌మిళ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.

allu arjun

ఇప్పుడు మురుగదాస్ లాంటి డైరెక్టర్ ముందుకి రావడంతో అల్లు అర్జున్ కూడా తమిళ తెలుగు భాషల్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే బన్నీ ఇప్ప‌టికే ఫుల్ క‌మిట్‌మెంట్‌లో ఉన్నాడు. అల వైకుంఠపురములో తర్వాత బన్నీ సుకుమార్, వేణు శ్రీరామ్ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాల‌ను ప‌క్క‌న పెట్టి, మురుగ‌దాస్ సినిమాను చేయ‌డానికి రెడీ అవుతాడా? లేక ఇవి అయ్యాకే బైలింగ్వల్ సినిమా చేస్తాడా? అన్ని రోజులు మురుగదాస్ వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.