‘యేవమ్’ సినిమా జెన్యూన్ రివ్యూ

చాందిని చౌదరి ప్రముఖ పాత్రలో తొలిసారి పోలీసు పాత్రలో నటించిన చిత్రం యేవమ్. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వికారాబాద్ ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల మధ్య జరిగినట్లు ఆయన చిత్రీకరించారు. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో భరత్ పోలీసు పాత్రలో కనిపించారు. అలాగే గోపిరాజు రమణ, దేవి ప్రసాద్, వశిష్ఠ, అశు రెడ్డి తదితులు నటించారు. ఈ చిత్రాన్ని నవదీప్, పవన్ గోపరాజు నిర్మించగా కీర్తన శేష్, నీలేష్ మండలపు సంగీతాన్ని అందించారు.

కథ:
వికారాబాద్ ప్రాంతంలో కొన్ని గుర్తు తెలియని సంఘటనలు జరుగుతాయి. ఓ హత్యా కూడా జరుగుతుంది. అలాగే ఆ ప్రాంతంలో సినిమా హీరోల పేర్లు చెప్పి యువతులను ఎవరు ఎం చేస్తున్నారు? పోలీసులు అయిన చాందిని, భరత్ అతడిని ఎలా అడ్డుకున్నారు? అనే కథ చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో చేదు ఏంటి? మంచి ఏంటి? ఎవరు చెడ్డావారు? ఎవరు మంచివారు? అనే ప్రశ్నలకు ప్రేక్షకులే సమాధానం చెప్పేలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

నటన:
సినిమాలో నటించిన చందిన చౌదరి తన పూర్తి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అలాగే వసిష్ఠ సింహ, భరత్ చాలా నాచురల్ గా నటించారు. ఆని కనిపించేది కొంతసేపు మాత్రమే అయినప్పటికీ బాగా నటించింది. అలాగే ఈ సినిమాలో పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విశ్లేషణ :
సాంకేతికపూరితంగా చూస్తే ఈ సినిమాలో ముఖ్యంగా దర్శకత్వం గురించి చెప్పుకోవచ్చు. దర్శకుడు ఇంతకు ముందు చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ చాలా సీనియర్ దర్శకునిలా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. స్క్రీన్ప్లే కొంచం స్లో గ ఉంది అనిపించినప్పటికీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సిమెలకు అదే మంచిది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా నిర్మాణ విలువలు చాలా బావున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ వీకెండ్ మంచి సినిమా దొరికింది అని చెప్పుకోవచ్చు. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా.