మామ గుడి గంటలు మోగిస్తున్న అల్లుడు… పాట అదిరింది

టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అక్కినిని, దగ్గుబాటి అభిమానులకి కొత్త కిక్ ఇచ్చిన వెంకీ మామ టీం, ఈసారి ఎన్నాళ్లకో అనే సాంగ్ తో బయటకి వచ్చింది. సెకండ్ లిరికల్ గా బయటకి వచ్చిన ఎన్నాళ్లకో సాంగ్ రెట్రో స్టైల్ ఆకట్టుకుంది. థమన్ ఇచ్చిన జోష్ ఫుల్ ట్యూన్ కి పృథ్వి చంద్ర వాయిస్ ఎస్సెట్ అయ్యింది. వెంకీ మామ గుండె పెంకు లేగరగొట్టే టీచరమ్మ అంటూ సాగిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుంది. నాగ చైతన్య, ఈ ముళ్లు ఎదో 20 ఏళ్ల క్రితం గుచ్చుకుంటే ఎలా ఉండేదో అనే చోట మొదలైన సాంగ్ వెంకీ మామకి ఫుల్ ఎనర్జీని ఇచ్చింది.