‘యమధీర’ మూవీ జెన్యూన్ రివ్యూ

పొలిటికల్ డ్రామా, ఈవీఎంల ట్యాంపరింగ్ స్టోరీ బేస్ గా కమర్షియల్ ఎంటర్టైనర్ గా యమధీర మూవీ

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

టెక్నికల్ టీం :
ప్రొడక్షన్ : శ్రీ మందిరం ప్రొడక్షన్స్
కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్
మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్ : సి రవిచంద్రన్
సంగీతం : వరుణ్ ఉన్ని
నిర్మాత : వేదాల శ్రీనివాస్ రావు గారు
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్
పి ఆర్ ఓ : మధు VR

కథ విషయానికొస్తే :
కెపి గౌతమ్ ( కోమల్ కుమార్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా అన్యాయాన్ని ఎదుర్కొంటూ ట్రాన్స్ఫర్లు అవుతూ వైజాగ్ కమిషనర్ గా వస్తాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేసి పరిష్కరించే క్రమంలో అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) ఆ యువకుడిని చంపిస్తాడు అని తెలుసుకుంటాడు. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ సీఎం అవుతాడు. తన పై అధికారి అయిన నాగబాబు సపోర్ట్ తో ఆ కేసును గౌతమ్ సాల్వ్ చేశాడా లేదా? దేశముఖ్ కి ఆ యువకుడు హత్యకి సంబంధమేంటి? సీఎం హోదాలో ఉన్న దేశముఖ్ నీ గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా చేశారంటే :
హీరోగా కోమల్ కుమార్ నటన చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీకాంత్ చాలా బాగా నటించాడు. రిషిక శర్మ తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ నటన ఆయన పండించిన కామెడీ చాలా అద్భుతంగా ఉంది. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ ఎవరు పరిధికి వారు బాగా నటించారు.

టెక్నికల్ ఆస్పెక్ట్ :
కన్నడ మాతృక అయిన అచ్చ తెలుగు సినిమా లాగా చిత్రీకరించారు. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ పై వేదాల శ్రీనివాసరావు గారు నిర్మాతగా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. డి ఓ పి గా రోష్ మోహన్ కార్తీక్ పనితీరు బాగుంది. వరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. శంకర్ ఆర్ ఎంచుకున్న కథ దర్శకత్వం చాలా బాగున్నాయి. వరదరాజ్ చిక్కబళ్ళపుర అందించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కోమల్ కుమార్, రిషిక శర్మ, నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్ నటన
క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు నెగిటివ్ షేడ్స్ పాత్రలకి బాగా సెట్ అవుతాడు
అలీ కామెడీ
ఆర్ శంకర్ కథ దర్శకత్వం
మదర్ సెంటిమెంట్, పొలిటికల్ డ్రామా
యాక్షన్ సీక్రెన్సెస్

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ ఉన్న లాగ్ సీన్స్
శ్రీశాంత్ గారు నిడివి కొంచెం తక్కువ ఉండడం
సాంగ్స్

ఎలక్షన్ టైం లో ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి జనాలకి అవగాహన కలిగించే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ యమధీర