Tollywood: “విన్నర్ ట్రిప్” ఆడియో విడుదల

Tollywood: యఫ్,యమ్ రేడియోలో విన్నర్ ట్రిప్ కు సెలెక్ట్ అయిన బ్యాచ్ గోవాకు వెలుతుంది.. అక్కడికెళ్లిన ఈ బ్యాచ్ ఒక ముఠా చేతిలో చిక్కుకొని ఎలా బయట పడ్డారనేదే “విన్నర్ ట్రిప్” .యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై మహి, సోనాపాటిల్ హీరో, హీరోయిన్లు గా తెలుగు శ్రీను దర్శకత్వంలో సంపత్ శ్రీను, కె.లక్ష్మణ్ రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం* “విన్నర్ ట్రిప్”.ఈ చిత్రానికి శశాంక్ భాస్కరుని సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధు లుగా విచ్చేసిన సీనియర్ నిర్మాత శ్రీ గురుపాదం టీజర్ ను విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ వైస్ చైర్మన్ రాదా రాజేశ్వరి, జబర్దస్త్ అప్పారావు ప్రమోషల్స్ సాంగ్స్ ను విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్,సెన్సార్ బోర్డ్ మెంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ వైస్ చైర్మన్ రాదా రాజేశ్వరి మరియు చిత్ర యూనిట్ అందరూ కలసి ఆడియో విడుదల చేశారు. అనంతరం ముఖ్యఅతిదిగా విచ్చేసిన సీనియర్ నిర్మాత శ్రీ గురుపాదం మాట్లాడుతూ.. నేను నిర్మాతగా 26 సినిమాలు నిర్మించాను. సీనియర్ నటులు యన్.టి.ఆర్, కృష్ణ, శ్రీదేవి లాంటి వారితో సినిమాలు నిర్మించాను. అప్పట్లో మీడియా లేకపోవడంతో మా సినిమాలకు సరైన ప్రమోషన్ లేక నిర్మాతలు ఇబ్బందులు పడేవారు.ఇప్పుడు సోషల్ మీడియా పెరగడంతో కంటెంట్ ఉన్న ప్రతి సినిమా హిట్ అవుతుంది.అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన “విన్నర్ ట్రిప్” పెద్ద విజయం సాధించాలని అన్నారు.

tollywood

Tollywood ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ వైస్ ఛైర్మన్ రాదా రాజేశ్వరి మాట్లాడుతూ.. ఈ సినిమా పేరులోనే విన్నింగ్ ఉంది కాబట్టి ఈ “విన్నర్ ట్రిప్” పెద్ద విజయం సాధించాలని అన్నారు.

Tollywood చిత్ర దర్శకుడు తెలుగు శ్రీను మాట్లాడుతూ.. యఫ్,యమ్ రేడియోలో విన్నర్ ట్రిప్ కు సెలెక్ట్ అయిన బ్యాచ్ గోవాకు వెళితే.. అక్కడికెళ్లిన ఈ బ్యాచ్ ఒక ముఠా చేతిలో ఇరుక్కొని చివరకు ఎలా బయట పడ్డారు, ఎంత మంది మిగిలారనే ఆశక్తి కరమైన కథాంశంతో ఈ “విన్నర్ ట్రిప్” ను తీయడం జరిగింది. మొదట”గోవా మాఫియా” పేరుతో షూటింగ్ స్టార్ట్ చేసి 32 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. షూటింగ్ పూర్తి అయిన తరువాత కథకు, సినిమాకు యాప్ట్ అవడం లేదని “విన్నర్ ట్రిప్” టైటిల్ పెట్టడం జరిగింది. నటీ, నటులందరు హార్డ్ వర్క్ తో చాలా బాగా నటించారు. నాకీ అవకాశమిచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

Tollywood చిత్ర నిర్మాత సంపత్ శ్రీను మాట్లాడుతూ.. ఇంటర్ చదువు కొనే రోజుల్లో నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో 2008 లో సినిమాలో హీరో అవ్వాలని వచ్చిన నేను హరో గా చేశాను కానీ ఆ సినిమా విడుదల కాకపోవడంతో తిరిగి మా ఊరికి వెళ్లడం జరిగింది. తరువాత సినిమా హీరో వచ్చాడని అందరూ ఎగతాళి చేసేవారు.తరువాత నాతో పాటు మా అమ్మ,, నాన్నలు కూడా ఎంతో అవమానం పడ్డారు దాంతో నాలో కసి పెరిగి ఎలాగైనా సినీ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకోవాలని చదువు పేరుతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డాను. నా కొడుకు హీరో కాలేకపోయినా నటులకు అవకాశం కల్పించే స్థాయికి ఎడిగాడని నా తల్లి,తండ్రి గర్వంగా చెప్పుకోవాలని ఏంతో కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా ఔట్ ఫుట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే డబ్బు పెడితే రాదు.మా టీం అంత మనసుపెట్టి ఈ సినిమాకోసం కష్టపడి దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేశారు.అలాగే మా బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా ఇంకొక చిత్రం స్టార్ట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాలో కూడా కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నాను.అలాగే ఈ “విన్నర్ ట్రిప్” సినిమా చాలా బాగా వచ్చింది.మీ అందరికీ తప్పక నచ్చుతుంది.వచ్చే నెల మొదటి వారంలో విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకులందరు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

Tollywood హీరో మహి మాట్లాడుతూ .. నేను హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారే వారి సపోర్ట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత దర్శక,నిర్మాతలు సపోర్ట్ మరచిపోలేను. నాకీ అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.

Tollywood హీరోయిన్ సోనాపటేల్ మాట్లాడుతూ.. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది అని అన్నారు. నటీనటులు మహి,సోనాపాటిల్,రవి కుమార్, శ్రీకర్, ప్రకాష్, దినేష్,ఆనంద్,కిషోర్, మనోహర్,లోగన్,ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో న‌టించారు. సాంకేతిక నిపుణులు: మ్యూజిక్ :- శశాంక్ భాస్కరుని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్..రాము గండికోట, ఎడిటింగ్ :- ఈశ్వర్ విరాట్, కెమెరా :- మహేష్ మట్టి, పి.ఆర్.ఓ :-మధు వి.ఆర్.