బిగ్‌బాస్‌లో ‘జలజ’ వాయిస్ ఎవరిదో తెలుసా?

మరికొద్దిరోజుల్లో ముగియనున్న క్రమంలో బిగ్‌బాస్ షో రక్తికట్టిస్తోంది. ఫైనల్‌కి సమయం దగ్గర పడుతున్న క్రమంలో బిగ్‌బాస్ యాజమాన్యం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా హౌస్‌లో దెయ్యం వాయిస్ ఓవర్‌తో కంటెస్టెంట్స్‌కు టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఆ దెయ్యం వాయిస్ ఓవర్ ఎవరిది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ దెయ్యంను చూసి అరియానా భయపడి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ మాత్రం ఎవరూ భయపడటం లేదు.

bigboss 4

బిగ్‌బాస్-1లో కూడా ఇలాంటి టాస్కే ఒకటి పెట్టారు. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు మళ్లీ ఆ టాస్కే పెట్టారు. ప్రస్తుతం బిగ్‌బాస్-4లో తన పేరు జలజ అని చెప్పిన దెయ్యం.. కంటెస్టెంట్స్‌ని పేరుతో పిలుస్తోంది. ఆ వాయిస్ హరితేజది అని చాలామంది అనుకుంటున్నారు. మరికొందరు సింగర్ గీతామాధురి వాయిస్ ఓవర్ అని చెబుతున్నారు.

వీటిపై తాజాగా హరితేజ, గీతామాధురిలు క్లారిటీ ఇచ్చారు. దెయ్యం వాయిస్ ఓవర్ తమది కాదని హరితేజ, గీతామాధురి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వాయిస్ సింగర్ సుజీతది అయి ఉంటుందని కొంతమంది అభిప్రాయప